- మానవ మెదడులో చిప్ ఇన్స్టాలేషన్ సాద్యమేనా?

Elon Musk new mission : సైన్స్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు కోసం ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి. వీటిలో న్యూరాలింక్ ఒకటి. ఇది ఎలోన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, దీని గురించి ఎంతో కాలంగా ఎలోన్ మస్క్ చెబుతూ వస్తూనే ఉన్నాడు. మనుషుల మెదడులో కంప్యూటర్ చిప్‌ని అమర్చి క్లినికల్ స్టడీస్ చేయడమే న్యూరాలింక్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు దు ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించలేదు. చాలా కాలంగా న్యూరాలింక్ ప్రాజెక్టు ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అలాన్ ప్రయత్నాలు ఫలించాయి.న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఆమోదం పొందింది US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఇటీవలే న్యూరాలింక్‌ని ఆమోదించింది. ఇప్పుడు అలెన్ కంపెనీ మానవ మెదడులో కంప్యూటర్ చిప్‌ని అమర్చడం ద్వారా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించవచ్చు. ఈ సమాచారాన్ని న్యూరాలింక్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సాంకేతికత క్లినికల్ ట్రయల్ కోసం పరిశోదనలు ఇంకా ప్రారంభించలేదు. అయితే దీని గురించి మరింత సమాచారం త్వరలో తెలియనుంది.
న్యూరాలింక్ మెదడు చిప్ అంటే ఏమిటి?
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ మానవ మెదడులో అమర్చబడే న్యూరల్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ ఆధారంగా కంప్యూటర్ చిప్ అమర్చుతారు. ఈ చిప్‌ని ఉపయోగించి, మెదడు ద్వారా అనేక పరికరాలను యాక్సెస్ చేయవచ్చు. అలాగే అనేక ఇతర పనులు చేయవచ్చు. ఈ సాంకేతికతతో, మెదడు నేరుగా కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌తో అనుసంధానించవచ్చు. దీనితో పాటు, మానవ మెదడును కూడా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయవచ్చు.
అలెన్ వాదన ఏమిటి?
న్యూరాలింక్ సాంకేతికతతో పక్షవాతం ఉన్నవారిని నడిచేలా చేస్తుంది. అంధుల్లో దృష్టిని పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుందని అలెన్ పేర్కొంటున్నాడు. అయితే, అలెన్ వాదనను నిజమని భావించడం తొందరపాటే అవుతుంది. పరిశోధనలు మొదలైన తర్వాతే నిజానిజాలు, ఫలితాలు, పర్యావనాలు ఏమిటో తెలియనుంది.