Kalyan Ram Wife : అతనొక్కడే సినిమాతో తెలుగు తెర మీద హీరోగా పరిచయమైన కల్యాణ్ రామ్ తరువాత హరేరామ్, కత్తి, ఓం 3డి, 118, బింబిసార వంటి సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశాడు. చివరగా నటించిన సినిమా అమిగోస్ లో కూడా మూడు పాత్రలు చేయడం విశేషం. కల్యాణ్ రామ్ 2006 ఆగస్టు 10న వివాహం చేసుకున్నాడు. భార్య పేరు స్వాతి. ఆమె డాక్టర్. వీరికి అద్వైత, శౌర్యరామ సంతానం.
స్వాతి వ్యాపార రంగంలో కూడా పేరు తెచ్చుకుంది. బింబిసార పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆమె సంస్థలోనే జరిగాయట. ఇక ఆమెకు నాగార్జున అంటే బాగా ఇష్టమట. కాలేజీ రోజుల్ల నాగార్జున నటించిన మన్మథుడు సినిమా ఎన్నో సార్లు చూసిందట. నాగ్ సినిమా విడుదలైందంటే చాలు కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాకు వెళ్లేదట. ఇలా కల్యాణ్ రామ్ భార్యకు నాగార్జున అంటే చాలా అభిమానమట.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. తమ్ముడితో జై లవకుశ తీసి అందరిలో ఆశ్చర్యం నింపాడు. నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న వాడు కావడంతో కథల ఎంపికలో జాగ్రత్తగా ఆలోచిస్తాడు. సినిమా హిట్ కావడానికి అవసరమయ్యే పార్ముల ప్రకారం వెళతాడు. అందుకే అతడు నిర్మించిన సినిమాలు హిట్ గా నిలుస్తుంటాయి.
తమ తాత పేరు మీదే బ్యానర్ ఏర్పాటు చేశాడు. తాత లాగే నటనలో ఆరితేరాడు. ప్రతి సన్నివేశంలో మంచి నటన ప్రదర్శిస్తుంటాడు. అందుకే వారి బ్యానర్ ప్రేక్షకులకు అంతలా గుర్తుండిపోతుంది. కల్యాణ్ రామ్ తరువాత మూవీ ఎవరితో తీస్తాడో తెలియడం లేదు. మొత్తానికి వీరి బ్యానర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు.