
Bro Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం బ్రో.. ఇటీవలే సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. తమిళం సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం ను దర్శకనటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఇప్పడీ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నది. పీపుల్స్ మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఓటీటీ రైట్స్ రూ. 40 కోట్లు..
ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 40 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుందని, రూ. 100 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ల నుంచి రూ. 55 కోట్ల బిజినెస్ చేస్తున్నదని సమాచారం. నైజాంలో 30 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 15 కోట్లు మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేస్తన్నదని టాక్.
బ్రోలో గెస్ట్ మాత్రమే..
సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పవన్ ది గెస్ట్ రోల్ మాత్రమే, క్యారెక్టర్ రన్ టైమ్ ఓ 20 నిమిషాలు మాత్రమే. కాకపోతే పవన్ ను చూపించి నిర్మాతలు 100 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ మార్కెట్ రూ. 30 కోట్లు దాటలేదు. పవన్ ఉండడంతో 100 కోట్లు బిజినెస్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లో 100 కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రం రాలేదు. కానీ పవన్ చిత్రాలకు రూ. 100 కోట్ల బిజినెస్ అవుతుంది. పవన్ కోసమే బయ్యర్లు భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. సినిమా ఫ్లాపైనా పవన్ ఎంతో కొంత తిరిగి చెల్లించేలా చేస్తారనేది బయ్యర్ల నమ్మకం. భీమ్లా నాయక్ విషయంలో అదే జరిగింది. మరి బ్రో మూవీ ఫలితం ఎలా ఉండబోతుందో జూలై 28 వరకు ఆగాల్సిందే.