30.8 C
India
Friday, May 10, 2024
More

    World Cup 2023 Half Way : సగానికి చేరిన వరల్డ్ కప్ 2023..  సంచలనాలకు కేరాఫ్ గా ప్లేయర్లు   

    Date:

    World Cup 2023 Half Way
    World Cup 2023 Half Way

    World Cup 2023 Half Way : ప్రపంచకప్ 2023 సంచలనాలకు కేరాఫ్ గా మారింది. జట్ల విజయాలు, పరుగులు, చిన్న చిన్న జట్లు రాణిస్తున్న తీరు సంచలనంగా మారుతున్నది. పెద్ద పెద్ద జట్లను ఆఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి పసికూనలు ఓడించి షాక్ ఇచ్చాయి. శ్రీలంక లాంటి జట్టు కూడా ఈ పసికూనల కంటే వెనుకబడింది.  ఇక ఈ సిరీస్ లో పరుగుల వరద పారుతున్నది. కీలక ఆటగాళ్లందరూ తమ జట్లలో రాణిస్తున్నారు.

    ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో డికాక్ 407 పరుగులతో వరల్డ్ కప్ లో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆయన 354 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో వార్నర్ 332 పరుగులతో ఉండగా, ఇక నాలుగో స్థానం కూడా భారత్ బ్యాట్స్ మెన్ దే కావడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 311 పరుగులతో నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రిజ్వాన్ 302 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఏదేమైనా ఈసారి సిక్స్ ల మోత కొనసాగుతున్నది.

    ఈపారి సిక్స్ ల విషయంలో కూడా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో 17 సిక్స్ లతో టాప్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక తర్వాత డికాక్, హెన్రిచ్ క్లాసెన్ 15 సిక్స్ లతో తర్వాతి స్థానంలోఉన్నారు. ఇక కౌశల్ మెండిస్ 14 సిక్స్ లు, డార్లి మిచెల్ 11, డేవిడ్ వార్నర్ 10 సిక్స్ లతో తర్వాతి స్థానాలో ఉన్నారు.

    ఇక బౌలింగ్ విషయానికి వస్తే జంపా 13 వికెట్లతో టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో సాంట్నర్ 12 వికెట్లు, బుమ్రా 11, మధుశంక 11, హెన్రీ 10 వికెట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఏదేమైనా ఈసారి ప్రపంచకప్ లో అనుకున్నదానికంటే ఎక్కువ సంచలనాలే నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....

    Dravid Plan : సెమీస్ కు టీమిండియా రెడీ..ద్రావిడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    Dravid Plan : వరల్డ్ కప్ లో టీమిండియా ఎనిమిది వరుస...

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.....