41.2 C
India
Sunday, May 5, 2024
More

    YouTube Bumper Offer : యూ ట్యూబ్ బంపర్ ఆఫర్.. ఇక డబ్బుల వర్షం కురవాల్సిందే..

    Date:

    YouTube Bumper Offer
    YouTube Bumper Offer

    YouTube Bumper Offer : వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతోంది. దీని కోసం యూ ట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ కు సంబంధించి నిబంధనలను కూడా సవరించిందినట్లు తెలిసింది. మానిటైజేషన్ అర్హత సాధించేందుకు సబ్ స్ట్ర్కైబర్ల సంఖ్యను కూడా తగ్గించింది. చిన్న చిన్న క్రియేటర్లు కూడా మానిటైజేషన్ టూల్స్ పొందేందుకు వీలుగా నిబంధనలను సైతం సవరించింది. దీని ప్రకారం ఇకపై తక్కువ సబ్ స్ట్ర్కైబర్ల బేస్ ఉన్న క్రియేటర్స్ కూడా యూ ట్యూబ్ లో డబ్బులను సంపాదించుకోవచ్చు.

    సవరించిన నిబంధనల ప్రకారం యూ ట్యూబ్ లో మానిటైజేషన్ కు కనీస అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్ స్ట్ర్కైబర్లు ఉండాలి. దీనికి తోడు సంవత్సరంలో కనీసం 4000 గంటల వ్యూవ్స్, లేదంటే లాస్ట్ 90 డేస్ లో 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూవ్స్ తప్పనిసరి. యూ ట్యూబ్ కొత్త మానిటైజేషన్ నిబంధనల పమేరకు ఇకపై 500 సబ్ స్ట్ర్కైబర్లు ఉంటే సరిపోతుంది. లాస్ట్ 90 డేస్ లలో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్ లోడ్ చేసి ఉండాలి. దీంతో పాటు ఏడాదిలో 3000 గంటల వ్యూవ్స్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూవ్స్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వారు యూ ట్యూబ్ మానిటైజేషన్ ప్రొగ్రామ్ కు అర్హత కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

    అయితే ఈ కొత్త మానటైజేషన్ నిబంధన యూ ట్యూబ్ అమెరికా, కెనడా, బ్రిటన్, దక్షిణ కొరియా, తైవాన్ లో అమలు చేస్తుంది. దాని ఫలితాలు పర్యవేక్షించిన తర్వాత మిగతా దేశాల్లో అమలు చేయనుంది. ఇక భారత్ లో ఈ నిబంధనలను ఎప్పుడు తీసుకువస్తుందో అనేది ఇంత వరకు చెప్పలేదు. యూ ట్యూబ్ యాజమాన్యం ఈ నిబంధనలు తేవడం వల్ల చిన్న క్రియేటర్స్ కూడా ఇకపై యూ ట్యూబ్ లో డబ్బు సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది. దీనితో పాటు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్ స్ట్ర్కైప్షన్ టూల్స్ ను కూడా పొందే వీలు కల్పిస్తుంది. దీనిపై ఇండియాలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YouTube channel : యూ ట్యూబ్ ఛానల్ తో కోట్ల సంపాదన.. ఎలా సాధ్యమంటే?

    YouTube channel : ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తోంది. వీడియోలూ,...

    Social Media : సోషల్ మీడియా భ్రమల్లో బతకొద్దు.. లైకులు, షేర్లు కాదు జీవితమంటే.. జనాలు పిచ్చోళ్లు కాదు!

    Social Media : ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వెర్రితలలు వేస్తోంది....

    Tamil Nadu : యూట్యూబ్ చూసి భార్యకు నార్మల్ డెలివరీ.. విషాదం

    Tamil Nadu : భార్యకు నార్మల్ డెలివరీ చేయాలని ఓ భర్త...

    Air India: త్వరపడండి.. 1470కే విమాన ప్రయాణం..

    Air India: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తీపి కబురు...