భారత్ లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర లోగల రాయ్ గడ్ లోని హరిహరేశ్వర్ బీచ్ లో టెర్రర్ బోట్ కలకలం సృష్టించింది. 2008 లో ముంబైలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఇలాగే పాకిస్థాన్ నుండి పడవ ప్రయాణం ద్వారా ఉగ్రవాదులు ముంబై పై దాడులు చేసారు.
ఇక తాజా విషయానికి వస్తే …….. ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలోని రాయ్ గడ్ బీచ్ లో టెర్రర్ బోట్ కనిపించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖాళీ పడవ మాత్రమే ఉండటం , అందులో 3 ఏకే 47 లు అలాగే బుల్లెట్లు , అమోనియం ఆ బోట్ లో లభించడంతో భద్రత కట్టుదిట్టం చేసారు. ఇటీవలే జెండా పండుగ అయిపోగా త్వరలోనే భారీ ఎత్తున వినాయకచవితి ఉత్సవాలు జరుగనున్నాయి. దాంతో విధ్వంసానికి ఉగ్ర కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ముంబై పోలీసులు.
Breaking News