
అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గ్రాహం నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగిరింది. స్పేస్ కిడ్జ్ ఇండియా అనే సంస్థ మన భారతదేశ జెండాను అంతరిక్షంలో ఆవిష్కరించేలా చేసింది. గ్రాహం నుండి 1,06,000 అడుగుల ఎత్తులో ఉన్న బెలూన్ లో జాతీయ జెండాను పంపించారు. దాంతో అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతం చోటు చేసుకుంది.
ఇటీవలే ఎర్త్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 750 మంది బాలికల చేత 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవాలకు గుర్తుగా AzadiSAT పేరుతో ఈ శాటిలైట్ ని అభివృద్ధి చేసారు. సాంకేతికంగా ఇది విఫలం అయినప్పటికీ అంతరిక్షంలో భారత్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.