
Brain active ఫ మనం ప్రస్తుతం జ్ణాపకశక్తిని కోల్పోతున్నాం. మన మెదడు సురక్షితంగా ఉంటేనే మనకు అన్ని చర్యలు సక్రమంగా సాగుతాయి. మెదడు బాగా పనిచేయాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరి. బాదం పప్పు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటివి తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే జింక్, మెగ్నిషియం, విటమిన్ బి వంటి పోషకాలు మన జ్ణాపకశక్తిని ప్రేరేపిస్తాయి.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాల్లో నిమ్మ, దానిమ్మ, నారింజ, కివి వంటి వాటిని తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. రోజు అరకప్పు చొప్పున బ్లూ బెర్రీ తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల జ్ణాపకశక్తి అనుమడిస్తుంది. బ్లూ బెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు గ్రాహక శక్తిని పెంచుతాయి. ఇలాంటివి తీసుకోవడం ఉత్తమం.
మెదడు పనితీరు బాగుండాలంటే జింక్ ఆహారాలు అవసరమే. ఇది ఉండే వాటిలో చికెన్, మటన్, బీఫ్, చేపలు, గుడ్లు వంటి మాంసాహారాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. బీన్స్, చిక్కుళ్లు, శనగల్లో కూడా జింక్ ఉంటుంది. దీంతో ఈ ఆహారాలు బాగా తీసుకుంటే మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీని వల్ల మనకు జ్ణాపక శక్తి సమస్య ఉండదు.
డార్క్ చాక్లెట్లలో కూడా ఫ్లేవనాయడ్లు ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా మెదడుకు మంచి జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ ఉండటం వల్ల మెదడు చురుకుా మారుతుంది. ఇలాంటి ఆహారాల వల్ల మెదడు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల మనకు మేలు కలుగుతుంది.