నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. సినిమాకు మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది దాంతో మొదటి రోజున 5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది .
కట్ చేస్తే రెండో రోజున కూడా భారీ వసూళ్లు వచ్చాయి. దాంతో రెండు రోజుల్లోనే 10 కోట్ల 20 లక్షలకు పైగా షేర్ వచ్చింది. 2 రోజుల్లోనే 10 కోట్లకు పైగా షేర్ రావడంతో మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాను కొన్న బయ్యర్లు లాభాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 16 కోట్లకు పైగా అమ్మారు. అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్లకు 17 కోట్లు వస్తే లాభాల్లోకి వస్తారన్న మాట. ఇప్పటికే 10 కోట్లకు పైగా వచ్చింది కాబట్టి మరో రెండు రోజుల్లోనే మిగతా సొమ్ము రావడం ఖాయమని భావిస్తున్నారు.
2014 లో వచ్చిన కార్తికేయ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఇన్నాళ్ల తర్వాత రూపొందించారు చందూ మొండేటి – నిఖిల్. కార్తికేయ చిత్రంలో స్వాతి హీరోయిన్ గా నటించగా కార్తికేయ 2 లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సకాలంలో విడుదల చేయకుండా చాలామంది నిర్మాతలు అడ్డుపడ్డారట. అయితే ఏ సినిమా కోసం అడ్డు పడ్డారో ఆ సినిమా ప్లాప్ అయ్యింది.
Breaking News