
DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్ రెడ్డికి డల్లాస్ మిత్రులు ఘనంగా సన్మానించారు. సతీష్ రెడ్డి తో పాటు చదువుకున్న JNTU హైదరాబాద్ మిత్రులు అలాగే మరికొంతమంది కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువాళ్లు తరలివచ్చారు. ఒక తెలుగు వ్యక్తి భారత రక్షణ సలహాదారుడుగా నియమింపబడటం గర్వకారణమని , అలాగే కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కోవిడ్ పేషేంట్ ల కోసం దేశీయంగా వెంటిలేటర్ లను తయారు చేయడం గొప్ప కార్యదక్షతకు నిదర్శనమని కొనియాడారు. ప్రవాసాంధ్రులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలిపారు సతీష్ రెడ్డి.
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లైన టాంటెక్స్ , తానా , నాటా , నాట్స్ , ఆటా సంస్థల ప్రతినిధులు సతీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి , చిల్లకూరు గోపి రెడ్డి , అజయ్ కలువ , ఉప్పలపాటి కృష్ణారెడ్డి , రామకృష్ణ , ప్రదీప్ రెడ్డి , బలరాం , భీమా , భాస్కర్ రెడ్డి ,సురేష్ మండువ తదితరులు పాల్గొన్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర దేశాల నుండి పాల్గొన్నవారిలో విలాస్ జంబుల , శ్రీకాంత్ తుమ్మల , సంతోష్ రెడ్డి , ప్రదీప్ కట్ట తదితరులు ఉన్నారు.