
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మన భారతదేశంలోని పంజాబ్ కు చెందిన వ్యక్తి కావడంతో కాబోలు , లేక కెనడా వీసాలను పెద్ద ఎత్తున నిరాకరిస్తుండటం కాబోలు మొత్తానికి పంజాబ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువగా బ్రిటన్ వైపు చూస్తున్నారు. కెనడా కు ఎక్కువ సంఖ్యలో పంజాబ్ వాసులు వెళ్ళేవాళ్ళు అయితే ఇటీవల కాలంలో కెనడా సగానికి సగం వీసాలను తగ్గించేసింది. దాంతో బ్రిటన్ వైపు చూస్తున్నారు.
బ్రిటన్ ఏడాదికి 1. 20 లక్షల వీసాలను మంజూరు చేస్తుంటే అందులో 40 శాతం పంజాబ్ స్టూడెంట్స్ దక్కించు కుంటుండటం విశేషం. బ్రిటన్ కు వెళ్ళడానికి మరో కారణం ఏంటంటే …… అక్కడి యూనివర్సిటీలు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తుండటం మరో విశేషం. ఇక ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక కావడంతో పంజాబ్ వాసులలో మరింత ఉత్సాహం , ఉత్తేజం వెల్లువెత్తుతోంది.