
నవంబర్ 14 న అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవం కావడంతో ఆ సందర్భంగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ , హైకోర్టు జడ్జి డివిఎస్ సోమయాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 50 వేల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు ప్రశంసా పత్రాలు అందించారు UBlood , JSW & Jaiswaraajya సంస్థల చైర్మన్ యలమంచిలి కృష్ణమూర్తి. ఈ కార్యక్రమంలో UBlood డైరెక్టర్ పాతురి నాగభూషణం , సిసోడియా , ఢిల్లీ రావు , శ్యామ్ ప్రసాద్ , శ్రీధర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వక్తలంతా మధుమేహ వ్యాధి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు.