కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను , నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు పర్యటన కోసం ఏర్పాటు చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రసంగించే వ్యాన్ కోసం కుప్పంలో జల్లెడ పడుతున్నారు అధికారులు. ఏపీలో 1861 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. బ్రిటీష్ పాలకులు తెచ్చిన చట్టాన్ని బూజు దులిపి మరీ ప్రయోగించింది జగన్ ప్రభుత్వం.
ఇటీవల చంద్రబాబు పర్యటనలో రెండు విషాదకర సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు సంఘటనలలో మొత్తం 11 మంది మరణించగా పెద్ద సంఖ్యలోనే గాయపడ్డారు. దాంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబు పై కొరడా ఝుళిపించాలని భావించింది. అందుకే 1861 పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చి ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం ప్రకారం ఏపీలో ర్యాలీలు , రోడ్డు షోలు , ధర్నాలు నిషేధం. ప్రత్యేక అనుమతి తీసుకున్న వాళ్లకు మాత్రమే సభలు , సమావేశాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికె ప్రభుత్వం ఈ నిర్ణయం తీడుకుందని వైసీపీ శ్రేణులు , అధికారులు చెబుతుండగా ….. టీడీపీ శ్రేణులు మాత్రం కుప్పం పర్యటన చేయడం ఖాయమని ….. ఎక్కడా తగ్గేదేలే అని అంటున్నారు.