ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట నిచ్చింది సుప్రీంకోర్టు. గత మార్చిలో ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజధాని గా అమరావతిని కొనసాగించాలని , అలాగే వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఖంగుతిన్న జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.
ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జగన్ కు ఊరట నిచ్చింది. అంతేకాదు ఏపీ హైకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు తన హద్దులు దాటిందని, కేబినెట్ నిర్ణయాలను సవాల్ చేసిందని అయితే హైకోర్టుకు పరిమితులు ఉన్నాయని తెలిపింది.
అంతేకాదు ఏపీ లోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే వచ్చే నష్టం ఏంటి ? అంటూ హైకోర్టును ప్రశ్నించింది. దాంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు పట్ల పూర్తి సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ డిసెంబర్ 5 న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.