గాంధీభవన్ లో అడుగు పెట్టేదే లేదని కుండబద్దలు కొట్టడమే కాకుండా శపథం చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు గాంధీభవన్ లో అడుగు పెట్టాడు. ఏడాది తర్వాత గాంధీభవన్ లో అడుగు పెట్టాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ రావు ఠాక్రే ఆహ్వానం మేరకు గాంధీభవన్ కు వెళ్ళాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక గాంధీభవన్ కు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటీ కావడం విశేషం. ఇక గాంధీభవన్ మెట్లు ఎక్కేదే లేదని శపథం చేసిన కోమటిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ ……. అబ్బే అలాంటిదేమి లేదు. మేమంతా ఒక్కటే అని చెప్పడం కొసమెరుపు.
Breaking News