
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఇది మోడీ దురహంకారానికి నిదర్శనమని , దేశ చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించి పోతోందని , ప్రతిపక్ష పార్టీలను వేధించడం బీజేపీకి పరిపాటిగా మారిందని దీన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
ఇక ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించాడు. రాహుల్ గాంధీపై వేటు అప్రజాస్వామికమని , రాజ్యాంగాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడమే అంటూ దుయ్యబట్టాడు. రాహుల్ గాంధీ పై వేటు వేయడం పట్ల దేశ వ్యాప్తంగా పలు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , ఉభయ కమ్యూనిస్టులు అలాగే ఇతర పార్టీ నాయకులంతా ముక్తఖంఠంతో ఖండించారు.