
వైజాగ్ లో ఈరోజు ఆస్ట్రేలియా – భారత్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. అయితే గత రెండు రోజులుగా ఏపీలో అందునా వైజాగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దాంతో ఈరోజు జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా ? లేదా ? అనే టెన్షన్ నెలకొంది క్రికెట్ అభిమానుల్లో. వైజాగ్ లో ప్రస్తుతం కారుమబ్బులు కమ్ముకున్నాయి దాంతో మరింత ఆందోళన చెందుతున్నారు అభిమానులు. భారీ వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ ఆలస్యం అవ్వడమో లేదంటే రద్దు చేయడమో జరుగుతుంది. అలాంటి ఊహను భరించలేకపోతున్నారు అభిమానులు. వర్షం రాకుండా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.