వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ కు ముచ్చెమటలు పట్టించి క్లీన్ స్వీప్ చేసిన ఇండియాకు టి 20 మ్యాచ్ లో మాత్రం ఘోర ఓటమి ఎదురయ్యింది. భారత్ పై సంచలన విజయం అందుకొని మంచి జోష్ లో ఉంది న్యూజిలాండ్. మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఇలాకా అయిన రాంచీ లో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా 177 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ కు ప్రారంభంలోనే చుక్కెదురు అయ్యింది. అయితే వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేసి 50 పరుగులు సాధించడంతో అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించడంతో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో కివీస్ విజయం సాధించింది.
Breaking News