Vijay Leo : కోలీవుడ్ లో దళపతి విజయ్ కు ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలిసిందే. అతడు నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో అతడు నటించిన సినిమా లియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. దీనికి లోకేస్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో సినిమాపై ఇప్పటికే చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.
తన గత చిత్రం విక్రమ్ లో లోకేష్ కొత్తవారితో అలరించిన అతడు ఇందులో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకుని ఆశ్చర్యపరుస్తున్నాడు. మరో బాలీవుడ్ స్టార్ కూడా ఇందులో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా అందరిలో భారీ అంచనాలు నమోదు చేస్తోంది.
ఇందులో హాలీవుడ్ నటుడు డెంజిల్ స్మిత్ కూడా కీలక రోల్ చేయనున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నిర్మించిన సినిమా టెనెట్ లో నటించిన నటుడే స్మిత్ కావడం గమనార్హం. లియో చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటోంది. లోకే ష్ ఈ సినిమాను ఎలా నిర్మిస్తున్నాడోనని అందరిలో ఆసక్తి కలుగుతోంది.
విజయ్ క్రేజీ లోకేష్ స్టామీనా కలిసి ఏం వండర్స్ చేయబోతున్నాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఎలా నిర్మిస్తున్నారోనని ఆతృత నెలకొంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు ఉండటంతో సినిమా నిజంగానే రక్తి కట్టిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి విజయ్ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో తెలియడం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేయడానికి కూడా వెనకాడుతున్నాయి.
ReplyForward
|