savitri : యాంకర్ శివజ్యోతి అంటే తెలియని వారు లేరు.. అయితే యాంకర్ శివజ్యోతి అనే కంటే సావిత్రక్క అంటేనే వెంటనే గుర్తు పడతారు.. తెలంగాణ యాసతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ వరకు కొంత మందికి మాత్రమే పరిమితం అయిన ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
ఈ మధ్య ఈమె సందడి అంతా ఇంత కాదు.. వరుస అవకాశాలతో షోస్ లో తెగ సందడి చేస్తూ దూసుకు పోతుంది. అలాగే ఈమె ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు తన ఫాలోవర్స్ ను పలకరిస్తూనే ఉంటుంది. కొత్త కొత్త వీడియోలతో వినోదాన్ని అందిస్తున్న ఈ భామ వీడియోలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
అయితే తాజాగా ఈమె బోనాల పండుగ సందర్భంగా యూట్యూబ్ లో ఒక వీడియో చేయగా ఈ వీడియోకు కొంత మంది నెగిటివ్ కామెంట్స్ చేసారు.. ఎప్పుడు కూడా ఈమె వీడియోలు చేసినప్పుడు కామెంట్స్ లో పిల్లల గురించి అడుగుతూనే ఉంటారు. పిల్లల్ని ఎప్పుడు కంటారు? త్వరగా కనండి.. అంటూ కామెంట్స్ చేస్తూనే ఉంటారు..
ఇక తాజాగా ఒక వ్యక్తి ఎంత ఫేమ్ వచ్చిన పిల్లలు లేకపోతే వేస్ట్ అక్క అంటూ కామెంట్స్ చేయగా ఈ కామెంట్ పై ఈమెను సపోర్ట్ చేసే వారంతా మండిపడుతున్నారు. అక్క అంటూ అలాంటి కామెంట్ చేసావ్ పిల్లలు లేకపోతే వేస్ట్ ఆ? మీ అక్కను కూడా ఇలాగె అడుగుతావా? అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు.
ఈమె ఎప్పుడు తాను తన కుటుంబం మొత్తం కూడా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం అని చెబుతూనే ఉన్న ఇలాంటి కామెంట్స్ చేయడం వారికీ బాధ కలిగే విషయమే.. ఇలాంటి కామెంట్స్ చేస్తూ పక్క వారి పర్సనల్ విషయాలను టచ్ చేయడం ఇకనైనా ఆపుతారో లేదో..