21.6 C
India
Wednesday, February 11, 2026
More

    credit cards: యూఎస్‌లో పెరుగుతున్న క్రెడిట్ కార్డుల లోన్లు.. ఆర్థిక సంక్షోభం తప్పదంటున్న నివేదికలు..

    Date:

    credit cards: ఒక వైపు రుణ పరిమితి పెంపుపై అమెరికా చట్ట సభల్లో సమావేశాలు నిర్వహిస్తుండగానే మరో రుణ సంక్షోభానికి తెరలేచేలా కనిపిస్తుంది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ నివేదిక ప్రకారం 1 మార్చి, 2023 నాటికి అమెరికన్లు 986 బిలియన్లను (ట్రిలియన్ డాలర్లకు కొంత తక్కువ) క్రెడిట్ కార్డులపై రుణాలుగా తీసుకున్నారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొదటి మూడు నెలల్లో ఫ్లాట్ గానే ఉన్నా.. తరువాత పెరుగుతూ వచ్చింది. ఇంటి అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడుతున్న కుటుంబాలు సదరు కార్డుల బిల్లు జనరేట్ కావడంతో నెల చివరిలో బిల్లు కడతాయి.

    పెరుగుతున్న కుటుంబ రుణం
    ‘ముందు కొనండి, తరువాత చెల్లించండి’ అనే విలక్షణమైన యూఎస్ సంస్కృతి కుటుంబ ఖర్చును పెంచుతూ పోతోంది. ఇది ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో రుణ భారాన్ని పెచుతూనే ఉంది. మొదటి త్రైమాసికంలో మొత్తం గృహరుణం 148 బిలియన్ డాలర్లు పెరిగి 17.05 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణంతో పోలిస్తే వేతన వృద్ధి మందగించడంతో ఈ ఏడాది అమెరికా కుటుంబాలపై రుణభారం తగ్గే అవకాశం లేదు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఏప్రిల్ 6 వరకు వాస్తవ సగటు వారపు వేతనాలు (ద్రవ్యోల్బణం-సర్దుబాటు) తగ్గాయి.

    బ్యాంక్రేట్-2022 సర్వేలో 55 శాతం మంది ఉద్యోగులు పెరుగుతున్న వస్తు, సేవల ఖర్చులకు అనుగుణంగా తమ వేతనాలు లేవని ఆరోపిస్తున్నారు. 2023లో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ పరిస్థితి ఇంకా ఉన్నత స్థాయిలోనే ఉంది. కుటుంబాలపై పెరుగుతున్న అప్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థను క్రమంగా దెబ్బతీస్తున్నాయి. 2008-09లో పెరుగిన గృహ రుణాలు ఆర్థిక మాంద్యానికి కారణం అయ్యాయి. 2008 చివరినాటికి ఎనిమిదేళ్ల గృహ నిర్మాణ బూమ్ తరువాత $12.68 ట్రిలియన్లకు చేరుకుంది. కానీ ఆ తర్వాత రుణ స్థాయిలు భారీగా పడిపోయాయి.

    ఈ తగ్గింపులో కొంత భాగం వినియోగదారుల వైఫల్యంగా కూడా చెప్పవచ్చు. ఛార్జీలు, ముఖ్యంగా తనఖా రుణాలపై చారిత్రాత్మక పెరుగుదల నుంచి ఉద్భవించినప్పటికీ, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత రుణాలను చెల్లిస్తూ, కొత్త రుణాలను తీసుకోకుండా ఆర్థిక వ్యవస్థ మెరుగు పరుచుకునేందుకు యూఎస్ కుటుంబాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని 2013లో ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ న్యూయార్క్ నివేదిక పేర్కొంది.

    2023లో బ్యాంకులు ఎదుర్కొనే ప్రధాన సంక్షోభం రుణ ఎగవేత, వ్యక్తులు తమ రుణాల చెల్లింపులను ఆలస్యం చేస్తున్నారు. మార్చి 2023 నాటికి, ఆ రేటు చారిత్రక స్థాయిలో 2.6 శాతంగా ఉంది. ఏదేమైనా, క్రెడిట్ కార్డులతో సహా లోన్ల ఈఎంఐ డేట్ దాటుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bank : బ్యాంకును మోసం చేసిన ఘనుడు.. 22 ఏళ్లకు చిక్కిండు

    bank : బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న నిందితుడు 22...

    Credit card : క్రెడిట్ కార్డు వాడడం లేదా..? ఇది తెలుసుకోవాల్సిందే..

    Credit card : క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కొందరు దాన్ని వినియోగించరు....

    RuPay Credit Card : రూపే ‍క్రెడిట్‌ కార్డులో కొత్త ఫీచర్లు.. వీటియో యూజర్స్ కు ఎలాంటి లాభం అంటే?

    RuPay Credit Card : దేశంలో డిజిటల్ ట్రాన్జాక్షన్ రోజు రోజుకు...

    Credit Cards : క్రెడిట్ కార్డులు వాడుతున్నారు సరే? ఈ కీలక మార్పులు తెలుసుకున్నారా?

    Credit Cards New Rules : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు...