
హాట్ భామ దీపికా పదుకోన్ హాట్ సాంగ్ ను పఠాన్ మేకర్స్ విడుదల చేసారు. బాలీవుడ్ దిగ్గజ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్థాపించి 50 ఏళ్ళు అవుతున్న సందర్బంగా నిర్మించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొన్ జంటగా నటించారు.
తాజాగా ఈ సినిమా నుండి ఓ పాటను విడుదల చేసారు. దీపికా పదుకోన్ టు పీస్ బికినిలో కుర్రాళ్లను బాగానే రెచ్చగొట్టింది. పాట మొత్తం బికినీలోనే అందాలను ఆరబోసి కంటి మీద కునుకు లేకుండా చేసింది. పాట మొత్తం బికినీ షాట్స్ కావడంతో కుర్రాళ్ళు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు ఈ పాటను. పఠాన్ చిత్రాన్ని జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇక ఇది బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ దక్షిణాదిన కూడా విడుదల కాబోతోంది. తెలుగు , తమిళ భాషల్లో కూడా పఠాన్ విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒక రకంగా ఇది రీ ఎంట్రీ లాంటిదే అని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ రీ ఎంట్రీలో ఎలా అదరగొడతాడు అన్నది తెలియాలంటే జనవరి 25 వరకు ఎదురు చూడాల్సిందే. గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. మరి పఠాన్ దానికి బ్రేక్ వేస్తుందా ? లేదా ? చూడాలి.