![ponniyin-selvan-1-ponniyin-selvan-towards-the-400-crore-mark ponniyin-selvan-1-ponniyin-selvan-towards-the-400-crore-mark](https://jaiswaraajya.tv/wp-content/uploads/2022/10/ponniyin-selvan-1-ponniyin-selvan-towards-the-400-crore-mark.jpeg)
విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం రవి , ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” పొన్నియన్ సెల్వన్”. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా 400 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.
సెప్టెంబర్ 30 న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూల్ చేసింది. తాజాగా ఈ చిత్రం 400 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. తమిళనాట మాత్రం ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. తెలుగులో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. అలాగే ఓవర్ సీస్ లో మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది పొన్నియన్ సెల్వన్.
పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించారు దర్శకులు మణిరత్నం. ఈ సినిమాని రూపొందించాలని 35 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు మణిరత్నం. తన ఇన్నేళ్ల కల ఇన్నాళ్ల తర్వాత నెరవేరడంతో చాలా చాలా సంతోషంగా ఉన్నాడు మణిరత్నం. ఇక పొన్నియన్ సెల్వన్ – 2 వచ్చే ఏడాది విడుదల కానుంది.