మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేరళ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మోహన్ లాల్ ఇంట్లో రెండు ఏనుగు దంతాలను అలంకరణ కోసం పెట్టుకున్నాడు. అయితే అధికారులు మోహన్ లాల్ ఇంట్లో తనిఖీ చేసిన సమయంలో రెండు ఏనుగు దంతాలు బయట పడ్డాయి. అటవీ చట్టాల ప్రకారం ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకోవడం నేరం దాంతో మోహన్ లాల్ పై కేసు నమోదు అయ్యింది.
ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోంది. తుది తీర్పు రావాల్సి ఉంది. అయితే నేను అటవీశాఖ అధికారుల అనుమతితోనే ఇంట్లో రెండు ఏనుగు దంతాలను పెట్టుకున్నట్లుగా మోహన్ లాల్ కేరళ హైకోర్టుకు తెలిపాడు. అంతేకాదు ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరాడు. ఇందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది.
ట్రయల్ కోర్టు తుది తీర్పు వెల్లడించిన తర్వాత మాత్రమే హైకోర్టు జోక్యం చేసుకుంటుందని , అప్పటి వరకు ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అంటూ మోహన్ లాల్ పిటీషన్ ను కొట్టివేసింది. దాంతో ట్రయల్ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే టెన్షన్ నెలకొంది. మలయాళంలో మోహన్ లాల్ సూపర్ స్టార్ అనే విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా జనతా గ్యారేజ్ అనే చిత్రంలో నటించాడు మోహన్ లాల్. అంతేకాదు మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి అలాగే రీమేక్ కూడా అయ్యాయి.