నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ” వీర సింహా రెడ్డి ” . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కి విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. బాలయ్య ముహూర్తం చూసి ఖరారు చేశాడట. జనవరి 12 న విడుదల చేయాలని. దాంతో దర్శక నిర్మాతలు వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో గతంలో బాలయ్య పలు చిత్రాల్లో నటించాడు. సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు చిత్రాలు అప్పట్లో ప్రభంజనం సృష్టించాయి. దాంతో ఆ మ్యాజిక్ మరోసారి క్రియేట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట దర్శక నిర్మాతలు.
ఇక బాలయ్య లుక్ , టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం అయ్యింది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
బాలయ్య సరసన శ్రుతి హసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో కన్నడ హీరో దునియా విజయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే జై బాలయ్య ….. జై జై బాలయ్య అనే పాట సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి పోరులో నాలుగు చిత్రాలు విడుదల అవుతుండగా……. అందరికంటే ముందుగా …… జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రంతో వస్తున్నాడు.