సుచీ లీక్స్ నిజమే ! మరికొందరి బండారం బయట పెడతానంటూ సవాల్ చేస్తోంది వివాదాస్పద నటి కల్పికా గణేష్. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది ఈ భామ. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ” యశోద ”. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ కల్పిక గణేష్. నటి ధన్య బాలకృష్ణ అంటే మండిపడుతోంది కల్పిక గణేష్.
ధనుష్ , ధన్య బాలకృష్ణ , అనిరుద్ , బాలాజీ మోహన్ తదితర ప్రముఖులు సుచీ లీక్స్ లో ఉన్నారని , వీళ్ళతో పాటుగా మరికొందరు సెలబ్రిటీలు కూడా ఆ కంపులో ఉన్నారని వాళ్ళందరి భాగోతం బయట పెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. పాపం సుచీ లీక్స్ , అలాగే ఈ కంపు గురించి చిన్మయి చాలా వరకు పోరాడింది కానీ ఆమెను సైడ్ చేసారు. కానీ నేను మాత్రం తగ్గేదిలే అంటోంది కల్పిక గణేష్. ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ బండారం బయటపెడతా అంటోంది. అయితే కల్పిక గణేష్ ఎంతగా విమర్శలు చేస్తోందో అంతే గట్టిగా తిప్పికొడుతోంది ధన్య బాలకృష్ణ. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.