నటసింహం నందమూరి బాలకృష్ణతో తండ్రీ కూతుర్లు తలపడుతున్నారు. బాలయ్య తో తండ్రీ కూతుళ్లు తలపడటం ఏంటి ? ఇంతకీ ఎవరా తండ్రీ కూతుళ్లు అని అనే కదా …..
మీ అనుమానం. ఇంతకీ ఆ తండ్రీ కూతుళ్లు ఎవరయ్యా అంటే …… శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్. అవును బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యింది. 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల కానుంది. వీర సింహా రెడ్డి చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ది కూడా పవర్ ఫుల్ పాత్ర అంట.
ఇక శరత్ కుమార్ విషయానికి వస్తే …….. వీర సింహా రెడ్డి చిత్రంలో శరత్ కుమార్ నటించడం లేదు కానీ బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో మాత్రం శరత్ కుమార్ నటిస్తున్నాడు. శరత్ కుమార్ 90 వ దశకంలో హీరోగా , విలన్ గా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే హీరోగా కంటే విలన్ గానే ఎక్కువగా ప్రాచుర్యం పొందాడు. ఇక ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో ఈరోజే శరత్ కుమార్ జాయిన్ అయ్యాడు.
దాంతో శరత్ కుమార్ లాంటి వెర్సటైల్ ఆర్టిస్ట్ తో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మొత్తానికి బాలయ్య 107 వ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించగా బాలయ్య 108 వ సినిమాలో శరత్ కుమార్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ” బ్రో ….. ఐ డోంట్ కేర్ ” అనే టైటిల్ ను అనుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అయితే బాలయ్య మాత్రం ఈ టైటిల్ కు ఒప్పుకోలేదు. దాంతో తెలుగులో టైటిల్ ఉండాలని ఆలోచన చేస్తున్నాడట అనిల్ రావిపూడి.