అడవి శేష్ హీరోగా నటించిన సక్సెస్ ఫుల్ చిత్రం హిట్ 2. డిసెంబర్ 2 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజున 11 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక రెండో రోజు కాస్త జోరు తగ్గినా మూడో రోజు మళ్లీ పుంజుకుంది. దాంతో 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దాంతో ఈ జోరు చూస్తుంటే అవలీలగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ 50 కోట్ల క్లబ్ లో చేరిందంటే బయ్యర్లకు భారీగా లాభాలు రావడం ఖాయం.
థియేట్రికల్ గానే 50 కోట్లు సాధిస్తే …… శాటిలైట్, డిజిటల్ , ఓటీటీ రైట్స్ రూపంలో మరో 50 కోట్లు రావడం పక్కా. అంటే 100 కోట్ల సినిమా అన్నమాట. ఇక ఈ సినిమాకు నిర్మాత నాని కావడంతో భారీగా లాభాలు పొందనున్నాడు.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అడవి శేష్ హీరోగా నటించగా మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ , పోసాని, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కోమలి ప్రసాద్ , మీనాక్షి చౌదరి గ్లామర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక థ్రిల్లర్ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు అడవి శేష్. ఇప్పటి వరకు అడవి శేష్ నటించిన చిత్రాలన్నీ థ్రిల్లర్ నేపథ్యంలోనే ఉండటం విశేషం.