అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ – దిల్ రాజు ల మధ్య గొడవ జరిగిందని అందుకు కారణం దర్శకుడు పరశురామ్ అంటూ ఫిలిం నగర్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అరవింద్ – దిల్ రాజు ఇద్దరు కూడా మంచి మిత్రులే ! ఎంత మిత్రులైనా సినిమాల పరంగా మాత్రం తీవ్రమైన పోటీ ఉంది ఇద్దరి మధ్య.
ఆ విషయం పక్కన పెడితే …….. ఇద్దరి మధ్య గొడవ జరిగిందా ? అంటే మాత్రం …… ఓ కారణం వల్ల మాత్రం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని , అవి వెంటనే క్లారిఫై కావడంతో వివాదం లేదని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే …… రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ . కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అయ్యింది కాకపోతే హీరో , దర్శకుడు సెట్ అయ్యారు కానీ నిర్మాత మారాడు అల్లు అరవింద్ స్థానంలో దిల్ రాజు వచ్చాడు ఇక్కడే వివాదానికి కేంద్రమైంది.
గీత గోవిందం అనే సినిమాకు సీక్వెల్ చేయాలని అప్పట్లో అనుకున్నారు కానీ సెట్ కాలేదు. సడెన్ గా విజయ్ దేవరకొండ హీరో పరశురామ్ దర్శకుడు కాకపోతే నిర్మాత దిల్ రాజు అని ప్రకటన రావడంతో అల్లు అరవింద్ కాంపౌండ్ ఒక్కసారిగా షాక్ అయ్యిందట. ఇదేంటీ మనకు ఒక్క మాటకూడా చెప్పకుండా ఇలా చేసారు అని. అయితే ఆ తర్వాత దర్శకుడు పరశురామ్ అలాగే దిల్ రాజు వివరణ ఇవ్వడంతో అల్లు అరవింద్ సంతృప్తి చెందినట్లు సమాచారం.