నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ” వీరసింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తుండగా శృతి హాసన్ , హానీ రోజ్ బాలయ్య సరసన నటిస్తున్నారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈరోజు సాయంత్రం వీర సింహా రెడ్డి చిత్రం నుండి ” మాబావ మనోభావాలు ” అనే ఐటెం సాంగ్ ను విడుదల చేయనున్నారు. అందులో మచ్చుగా ఈ వీడియో సాంగ్ ఎలా ఉండబోతోందో చిన్న హింట్ ఇస్తూ ఓ వీడియో వదిలారు. ఆ సాంగ్ లో బాలయ్య రెచ్చిపోయాడు. అదిరిపోయే స్టెప్స్ వేసాడు. ఇక సాంగ్ కూడా దద్దరిల్లి పోయేలా కనబడుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన జై బాలయ్య , సుగుణ సుందరి పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. తాజాగా విడుదలయ్యే మాబావ మనోభావాలు అనే ఐటెం సాంగ్ ఆ పాటలను మించి ఉండేలా కనబడుతోంది. థియేటర్ లలో మాబావ మనోభావాలు పాట పిచ్చి పీక్స్ అనేలా ఈలలతో గోలలతో దద్దరిల్లి పోవడం ఖాయమని భావిస్తున్నారు. వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.