Ntr మెగా కుటుంబానికి జూన్ నెల సంతోషాన్ని కలిగించింది. రాంచరణ్, ఉపాసన గారాల పట్టి క్లీంకార పుట్టడంతో ఫ్యామిలీ సందడి చేసింది. వారి వివాహమై 11 ఏళ్లు గడవడంతో వారికి పాప పుట్టి వారి ఆశలను పెంచేసింది. మెగా కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. రాంచరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షల వెల్లువ పెరిగింది. అద్భుతమైన బహుమానాలు అందుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు చరణ్ కు మంచి స్నేహం ఉంది. వీరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. వీరి స్నేహాన్ని తెలియజేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రాంచరణ్ ఉపాసనల గారాల పట్టి క్లీంకారకు జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యకరమైన బహుమతి అందజేశారు.
క్లీంకార కోసం రాంచరణ్, ఉపాసన, క్లీంకార ముగ్గురు పేర్లతో ఉన్న బంగారు డాలర్లను డిజైన్ చేసి బహుమతిగా ఇచ్చాడు. ఈ బహుమతిని తారక్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ ఎంతో ఇష్టంగా అందజేశారు. క్లీంకార పుట్టినప్పటి నుంచి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నందున ఈ బహుమతికి వారు ఎంతో మురిసిపోయారు.
మెగా కుటుంబానికి పాప పుట్టడం సంతోషాన్ని కలిగించింది. ఇన్నాళ్లు ఎదురు చూసినా వారికి తగిన న్యాయమే దక్కింది. వారి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్, ఉపాసన జంటకు పాప రావడం అందరిలో సంతోషాన్ని నింపింది. మెగా కుటుంబానికి ఇన్నాళ్లకు వారసురాలు రావడం గొప్ప విషయమే.