డార్లింగ్ ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ భామ కృతి సనన్. తాజాగా ఈ భామ బేధియా (తెలుగులో తోడేలు ) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు సంధించారు. ఇక ఒక ప్రశ్న ఏంటంటే…… ప్రభాస్ , కార్తీక్ ఆర్యన్ , టైగర్ ష్రాఫ్ లలో ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు ? ఎవరితో డేటింగ్ చేస్తావు ? ఎవరిని పెళ్లి చేసుకుంటావని కృతి సనన్ ని ప్రశ్నించారు.
ఎంత కొంటెగా ప్రశ్నలు వేసారో అంతే కొంటెగా సమాధానాలు ఇచ్చింది ఈ భామ. కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తాను , టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ కు వెళ్తాను అయితే పెళ్లి మాత్రం ప్రభాస్ ను చేసుకుంటానని స్పష్టం చేసింది. దాంతో షాకవ్వడం మిగతా వాళ్ళ వంతు అయ్యింది. ముగ్గురు హీరోలను కవర్ చేయడం , ముగ్గురితో రొమాన్స్ చేయాలనే ఆసక్తి ఉందని చెప్పడం …… వింటే కృతి సనన్ మాములు భామ కాదు సుమా ! అంటూ నోరెళ్ళ బెడుతున్నారు.
కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి సనన్ సీతగా నటిస్తుండగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు భారీ స్థాయిలో వ్యతిరేకత రావడంతో రీ షూట్ కు ప్లాన్ చేస్తున్నారు.