తనపై అలాగే తన కుటుంబంపై ఓ స్టార్ హీరో ట్రోల్ చేయిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసాడు హీరో మంచు విష్ణు. జూబ్లీహిల్స్ లో ఓ కార్యాలయం తీసుకొని 20 మందిని ఈ పని మీదనే పెట్టాడు. కావాలనే మమ్మల్ని అదేపనిగా ట్రోల్ చేయిస్తున్నాడని ఐపీ అడ్రస్ తో సహా త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని అంటున్నాడు మంచు విష్ణు.
గతకొంత కాలంగా మంచు విష్ణు , మంచు మనోజ్ , మోహన్ బాబు , మంచు లక్ష్మీ ప్రసన్న లపై అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం మరీ ఎక్కువ అయ్యింది. అయితే ఇది ఇన్నాళ్లు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. కట్ చేస్తే ఓ స్టార్ హీరో ఉండి ఇదంతా చేయిస్తున్నాడని మంచు విష్ణు కు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం నుండి ఈ ట్రోల్స్ మరీ ఎక్కువ అయ్యాయని , పూర్తి వివరాలు సేకరించామని , పూర్తి వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు ? అనేది మాత్రం వెల్లడించలేదు. బహుశా మెగా కుటుంబం లోని హీరోలు ఈ పని చేయిస్తున్నారని మంచు విష్ణు భావిస్తుండొచ్చు.