Nabha Natesh సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం, అభినయం మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి.. అలా లక్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం.. మరి సినీ ఇండస్ట్రీలో అందరి లక్ ఒకేలా ఉండదు.. ఒక్కొక్కరు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగితే ఇంకొందరు లక్ బాలేక పెద్దగా రాణించలేక పోతారు.
మరి అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వెనుక బడిన హీరోయిన్ లలో నభా నటేష్ ఒకరు.. ఈమె యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే తెచుకుంది కానీ పెద్దగా రాణించడం లేదు.. స్టార్ హీరోల సరసన నటించే మెటీరియల్ అయిన ఈమెను పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు..
ఈ కన్నడ బ్యూటీ ముందుగా కన్నడలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాలు చేసింది.. ఆ తర్వాత తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఇక్కడ అడుగు పెట్టి క్రేజ్ అయితే తెచ్చుకుంది కానీ.. వరుస ప్లాప్స్ పడడంతో ఈమె స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.
అయితే ఈమె కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్.. ఈ సినిమాతో బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. దీని తర్వాత పలు సినిమాలు చేసిన మళ్ళీ అదే పరిస్థితి.. దీంతో ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ కాలం గడుపుతుంది..
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. నభా నటేష్ తాజాగా చీరలో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ కుర్రకారును బాగా ఆకర్షిస్తున్నాయి.. ఎర్ర చీరలో అమ్మడి అందం చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఆ పిక్స్ మీకోసం..