
కింగ్ నాగార్జున హీరోగా నటించిన చిత్రం ” ది ఘోస్ట్ ”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 5 న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల అయ్యింది. అయితే తెలుగునాట స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున నటించిన చిత్రం కావడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యింది ఈ చిత్రం.
దసరా రోజున ఖచ్చితంగా ఓపెనింగ్స్ బాగుంటాయి కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4. 60 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది ఈ చిత్రం. అంటే మొదటి రోజున కేవలం రెండున్నర కోట్ల షేర్ వచ్చిందన్న మాట. ఒక స్టార్ హీరోకు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రావడం పట్ల తీవ్ర షాక్ లో ఉన్నారు బయ్యర్లు. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు మరింత షాక్ కి లోనయ్యారు.
ది ఘోస్ట్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే 22 కోట్ల షేర్ వస్తే బయ్యర్లంతా లాభాల్లోకి వస్తారు. అయితే మొదటి రోజునే కేవలం రెండున్నర కోట్ల షేర్ మాత్రమే రావడంతో మరో 19 కోట్లు వస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే కనీసం 10 కోట్ల షేర్ రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. అంటే ఈ లెక్కన ది ఘోస్ట్ డిజాస్టర్ అన్నమాట.