కర్నూల్ లోని ఓ థియేటర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాళ్లతో దాడి చేసారు. ఈ రాళ్ల దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాంతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ సంచలన సంఘటన ఏపీ లోని కర్నూల్ లోని శ్రీరామ థియేటర్ లో జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే.
దాంతో కర్నూల్ శ్రీరామ థియేటర్ లో కూడా జల్సా చిత్రాన్ని ప్రదర్శించారు ఆ థియేటర్ యాజమాన్యం. జల్సా చిత్రం కొత్త ప్రింట్ తో 4 K రెసొల్యూషన్ లో విడుదల అయ్యింది. తమ అభిమాన హీరో నటించిన సినిమా మళ్ళీ విడుదల అవుతుండటంతో భారీ ఎత్తున పవన్ అభిమానులు తరలివచ్చారు.
అయితే సినిమా ప్రదర్శిస్తున్న శ్రీరామ థియేటర్ లో సరైన సౌండ్ సిస్టం లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతకీ సౌండ్ సిస్టం బాగుకాకపోవడంతో సరిగా రాకుండానే అలానే సినిమా ప్రదర్శించడంతో ఆ కోపాన్ని తట్టుకోలేక థియేటర్ లోపల కొన్ని కుర్చీలను విరగ్గొట్టారు అలాగే బయటకు వచ్చి థియేటర్ అద్దాలను కూడా ధ్వంసం చేసారు. అభిమానుల ఆగ్రహంతో థియేటర్ ధ్వంసం కావడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అభిమానులపై కేసు నమోదు చేసారు పోలీసులు.
Breaking News