అడవి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం గూఢచారి. ఈ సినిమాతో అడవి శేష్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పుడే దానికి సీక్వెల్ చేస్తామని ప్రకటించారు కానీ కాలయాపన అవుతూ వచ్చింది. అడవి శేష్ ఇతర సినిమాలు కమిట్ ఉండటంతో గూఢచారి 2 వాయిదా పడుతూ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు గూఢచారి 2 చిత్రానికి మోక్షం లభించింది.
అనిల్ సుంకర , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గూఢచారి 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకు వచ్చాయి. అడవి శేష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కావడంతో గూఢచారి 2 చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా రూపొందించనున్నారు. ఈమేరకు రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. స్పై నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి వివరాలను రేపు ప్రకటించనున్నారు.