21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట పెళ్లి బాజాలు.. సూపర్ ట్విస్ట్.

    Date:

     

    Akkineni Supriya, Adivi Sheshu
    Akkineni Supriya, Adivi Sheshu

    Akkineni House Marriage Weddings : అక్కినేని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎవరిది..? అన్న సందేహం ప్రతీ ఒక్కరి మదిలో కలుగుతుంది. ఇటీవల విడాకులు అయిన నాగ చైతన్యదా..? లేక అఖిల్ దా..? మరి ఇంకెవరిది అంటూ ప్రశ్నల వర్షం కురుస్తుంది.

    విలక్షణ సినిమాలతో డిఫరెంట్ బజ్ క్రియేట్ చేసుకున్న నటుడు అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అడవి శేష్ స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన డేట్స్ దొరకడం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆయన చేసిన సినిమాలు ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కథతో సాగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శేష్ త్వరలో అక్కినేని ఇంటికి అల్లుడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    నాగార్జున మేన కోడలు సుప్రియతో అడవి శేష్ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. ఈ నెల చివరిలోనే వీరి పెళ్లి జరుగుతుందంటూ కూడా వినిపిస్తోంది. సుప్రియ యార్లగడ్డ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సుప్రియకు చరణ్ రెడ్డితో గతంలోనే పెళ్లి జరిగింది. అయితే దంపతుల మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో విడిపోయారు.  ఆ తర్వాత చరణ్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడు. చాలా కాలం వెండితెరకు దూరంగా ఉన్న సుప్రియ అడవి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ లవ్ లో పడ్డారని టాక్ వినిపించింది. అది ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లినట్లు పుకార్లు వ్యాపించాయి.

    జూన్ 16వ తేదీ వీరి పెళ్లి ఉండబోతోందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ గానీ, అడవి శేష్ గానీ, సుప్రియా గానీ క్లారిటీ ఇవ్వలేదు. అలాగని ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై ఎవరు..? ఎప్పుడు..? ఎలా..? స్పందిస్తారో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Decoit Title Teaser : ‘డెకాయిట్’ టైటిల్ టీజర్: అడవి శేషు, శ్రుతి అదిరిపోయే సీన్స్..

    Decoit Title Teaser : అడివి శేషు అంటే విలక్షణ కథ,...

    Adivi Sesh Meets : అడవి శేషును సన్మానించిన యూపీ సీఎం

    Adivi Sesh Meets Up CM Yogi Aditynath : యూపీ...

    గూఢచారి 2 కు రంగం సిద్ధం

    అడవి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం గూఢచారి. ఈ...

    అడవి శేష్ సుప్రియతో లవ్ లో ఉన్నాడా ?

    యంగ్ హీరో అడవి శేష్ సుప్రియతో లవ్ లో ఉన్నాడా ?...