36.9 C
India
Tuesday, April 21, 2026
More

    ప్రభాస్ తో సినిమా గురించి దిల్ రాజు ఏమన్నాడంటే

    Date:

    producer dil raju comments on prabhas
    producer dil raju comments on prabhas

    డార్లింగ్ ప్రభాస్ తో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా మారింది. దాంతో ప్రభాస్ డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అయినప్పటికీ నేను ప్రభాస్ తో సినిమా చేయడం ఖాయమని అన్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు.

    బలగం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఆ సినిమా ఇచ్చిన జోష్ లో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఇదే సమయంలో 20 సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” దిల్ ”. ఆ చిత్రం తోనే దిల్ రాజు నిర్మాతగా మారాడు. దిల్ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు అవుతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్ల తో ఇంటరాక్ట్ అయ్యాడు దిల్ రాజు.

    ఇక ఆ సందర్బంగా పలువురు నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగానే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తారు ? అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చి డార్లింగ్ అభిమానులను సంతోష పరిచాడు దిల్ రాజు. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు అయ్యాక తప్పకుండా నేను ప్రభాస్ కలిసి ఓ సినిమా చేస్తామని చెప్పాడు.

    గతంలో ప్రభాస్ హీరోగా మున్నా , డార్లింగ్ వంటి చిత్రాలను నిర్మించాడు దిల్ రాజు. మున్నా ప్లాప్ కాగా డార్లింగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నాడు కానీ బాహుబలి తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగిపోయింది. దాంతో చాలా బిజీ అయిపోయాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...