
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ . ఆహా కోసం చేస్తున్న ఈ షో బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కూడా స్టార్ట్ చేసారు. ఇక ఈ షో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండో సీజన్ లో ప్రభాస్ , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు రావడంతో పీక్స్ కి వెళ్ళింది అన్ స్టాపబుల్ క్రేజ్.
కాగా ఈ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో రాంచరణ్. తాజాగా చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నాడు. ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ నిలిచింది దాంతో ఆసినిమా ప్రమోషన్ కోసం 20 రోజుల ముందుగానే అమెరికా వెళ్ళాడు చరణ్. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ షో అయిన ” GOOD MORNING AMERICA ” షోలో పాల్గొన్నాడు చరణ్. చాలా పాపులర్ షో అయిన ఈ షోలో అందరికీ ఛాన్స్ లభించదు. కానీ చరణ్ కు మాత్రం ఈ ఛాన్స్ లభించింది దాంతో మెగాస్టార్ చిరంజీవి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు.
ఇక ఈ షోలో పాల్గొని వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బాలయ్య అన్ స్టాపబుల్ షో గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా చరణ్ సమాధానం ఇచ్చాడు. బాలయ్య ఆషో అద్భుతంగా హోస్ట్ చేస్తున్నాడు. నేను కూడా ఫోన్ ఇన్ లో పాల్గొన్నాను. అలాగే నాకు ఆ షోలో పాల్గొనాలని ఉంది ….. అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు.