
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు 13 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే 13 చిత్రాలు కూడా భారీ విజయం సాధించాయి. ఇక ఇప్పుడేమో బాహుబలి సిరీస్ చిత్రాలు అలాగే ఆర్ ఆర్ ఆర్ తో అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించాడు. అయితే ఇన్ని సంచలనాలు సృష్టించినప్పటికీ రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఆయన భార్య రమా రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళి బాగానే సినిమాలు చేశాడు కానీ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ చిత్రం మాత్రం సరిగ్గా తీయలేదని, అది నాకు నచ్చలేదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది.
యమదొంగ చిత్రాన్ని రాజమౌళి సరిగ్గా చిత్రీకరించలేదని , అందుకే నాకు నచ్చలేదని అయితే ఎన్టీఆర్ మాత్రం అద్భుతంగా నటించాడని అందువల్లే ఆ సినిమా హిట్ అయ్యిందని……. రాజమౌళి వల్ల కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించి షాక్ ఇచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలకు అన్నింటికీ కూడా ఆయన కుటుంబం మొత్తం భాగస్వామ్యం అవుతుంది. ఇక అందులో రమా రాజమౌళి కూడా సింహభాగం పంచుకుంటుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తుందన్న విషయం తెలిసిందే.