
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. 5 రోజుల్లోనే 49 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ధమాకా చిత్రం. డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. 2022 ఇయర్ ఎండింగ్ బాగానే ఉందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
పక్కా ఎంటర్ టైనర్ గా రూపొందిన ధమాకా చిత్రంపై రవితేజకు ముందునుండి నమ్మకం ఉంది …… ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల గ్లామర్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. శ్రీ లీల అందాలు కుర్రాళ్లను పిచ్చెక్కించాయి.
బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడంతో ధమాకా హంగామా మరికొద్ది రోజులు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ధమాకా తప్పకుండా 75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ధమాకా చిత్రంతో మరోసారి సత్తా చాటాడు రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు రవితేజ. దాంతో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని భావిస్తున్నారు.