ఎట్టకేలకు మాస్ మహరాజ్ రవితేజ హిట్టు కొట్టాడు. గతకొంత కాలంగా రవితేజ సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్లే పోతున్న విషయం తెలిసిందే. దాంతో ఇక రవితేజ పని అయిపోయినట్లే అనుకున్నారు. రొటీన్ , పరమ రొటీన్ చిత్రాలతో ప్రేక్షకులు విసిగిపోయిన సమయంలో రొటీన్ స్టోరీతో మరోసారి ధమాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
రవితేజ తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ను గతకొంత కాలంగా ప్రేక్షకులకు అందించలేక పోతున్నాడు. అయితే ఆ అపవాదును ఈ ధమాకా పోగొట్టడం ఖాయం. తనదైన ఎంటర్ టైన్ మెంట్ తో రవితేజ అలరించగా శ్రీ లీల గ్లామర్ తో పిచ్చెక్కించింది. భీమ్స్ అందించిన పాటలు , నేపథ్యం సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దాంతో రవితేజ ఆకలి తీరినట్లే. మొత్తానికి రవితేజ ధమాకా తో హిట్టు కొట్టాడు.