మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం ” ధమాకా ”. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23 న విడుదల కానుంది. ధమాకా సినిమా ఇంకా విడుదల కాకముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా విడుదల కాకముందే రివ్యూ రావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు , రివ్యూ రైటర్ ఉమైర్ సంధు ఈ రివ్యూ ఇచ్చాడు.
చాలా కాలంగా ఉమైర్ సంధు రివ్యూలను ఇస్తూనే ఉన్నాడు. అయితే అతడు ఇచ్చిన రివ్యూలన్నీ ఘోరంగా ఉంటాయి. సూపర్ గా ఉంది అంటే ప్లాప్ అన్నట్లే ! ఇక ప్లాప్ అంటే కొన్ని హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు కావడంతో సినిమాను ముందుగానే చూస్తాడు దాంతో వెంటనే రివ్యూలు ఇస్తుంటాడు. ధమాకా చిత్రానికి యితడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా …… 2/5.
రవితేజ ఇక సినిమాలు మానేసుకుంటే బెటర్ అని , కెరీర్ ముగిసినట్లే అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసాడు. ఇలాంటి మాస్ సినిమాల్లో నటించడం మానేసి సీరియస్ రోల్స్ చేయండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అయితే మరీ నాసిరకంగా 2 స్టార్ మాత్రమే రేటింగ్ ఇవ్వడంతో రవితేజ అభిమానులు ఉమైర్ సంధు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధమాకా చిత్రం ఎలా ఉందో రేపు ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు. రవితేజ హీరోగా నటించగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది ధమాకా చిత్రంలో.