
ఆస్కార్ రేసులో మరింత ముందుకు వెళ్ళింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ” నాటు నాటు ” సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ కేటగిరీలో చాలా చిత్రాలు ఉండగా అందులో షార్ట్ లిస్ట్ చేసారు. అంటే కొన్ని చిత్రాలను తీసివేసి కొన్నింటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.
నాటు నాటు అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. రాంచరణ్ , ఎన్టీఆర్ లు పోటీ పడి చేసిన డ్యాన్స్ తో ఈ పాటకు మరింత అందం వచ్చింది. ఇక ఈ పాటను చంద్రబోస్ రాసిన విషయం తెలిసిందే. దాంతో తాను రాసిన పాట ఆస్కార్ బరిలో నిలిచినందుకు చాలా సంతోష పడుతున్నాడు. తప్పకుండా ఆస్కార్ గెలిచే చిత్రం ….. ఆస్కార్ గెలిచే పాట ఇదే అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల వసూళ్లను సాధించి సంచలన విజయం సాధించింది. ఎన్టీఆర్ కొమురం భీం గా నటించగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. అలియా భట్ , సముద్రఖని తదితరులు నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. ఇక ఇప్పడు ఆస్కార్ రేసులో నాటు నాటు పాట మరింత ముందుకు పోవడంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉంది.