స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముచ్చటగా మూడో రిలీజ్ డేట్ ఇది. గతంలో రెండుసార్లు విడుదల తేదీని ప్రకటించారు ….. అలాగే వాయిదాలు వేశారు. ఇక ఇప్పుడేమో ముచ్చటగా మూడోసారి విడుదల తేదీ ప్రకటించారు. ఇంతకీ కొత్త విడుదల తేదీ ఏంటో తెలుసా……. ఏప్రిల్ 14.
2023 ఏప్రిల్ 14 న శాకుంతలం చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఆమేరకు అధికారిక ప్రకటన చేశారు. మండు వేసవిలో శాకుంతలం విడుదల కానుంది. దాంతో తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరించనున్నాడు. సమంత శకుంతల గా నటించగా ఇతర కీలక పాత్రల్లో మోహన్ బాబు , దేవ్ మోహన్ ,శరద్ ఖేల్కర్ , మధుబాల , అల్లు అర్హ తదితరులు నటించారు. హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం.
మహారాణి పాత్రలో నటించాలనేది సమంత కోరిక. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా ? అని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో గుణశేఖర్ ఈ కథ చెప్పడం , వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రెండేళ్ల పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న శాకుంతలం ఎట్టకేలకు ఈ వేసవిలో ఏప్రిల్ 14 న విడుదల కానుంది.