మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టింది అందాల భామ శృతి హాసన్. ఈరోజు వైజాగ్ లో అంగరంగ వైభవంగా మెగా అభిమానుల మధ్య వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కోసం చిరంజీవి , రవితేజ తదితరులు వైజాగ్ వెళ్లారు. అయితే వారివెంట వెళ్లాల్సిన శృతి హాసన్ మాత్రం వెళ్ళలేదు.
దాంతో ఎందుకు వెళ్ళలేదు అంటూ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఇంతకీ శృతి హాసన్ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు ఎందుకు వెళ్లలేదో తెలుసా ……. శృతి హాసన్ కు జ్వరం రావడం వల్లే ! అవును తనకు అనారోగ్యమని , అందుకే ఈరోజు జరగాల్సిన ఈవెంట్ కు వెళ్లడం లేదని సోషల్ మీడియాలో పేర్కొంది దాంతో మెగా అభిమానులు కాస్త శాంతించడం ఖాయం ……. లేదంటే శృతి హాసన్ ను అదేపనిగా ట్రోల్ చేసేవాళ్ళు.
ఎందుకంటే ……. బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రంలో కూడా శృతి హాసన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. వీర సింహా రెడ్డి ఈవెంట్ లో మాత్రం పాల్గొంది మా వాల్తేరు వీరయ్య ఈవెంట్ లో మాత్రం పాల్గొనవా ? అని ట్రోల్ చేయడం ఖాయం. అయితే వివరణ ఇచ్చింది కాబట్టి కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక వీర సింహా రెడ్డి జనవరి 12 న వస్తుండగా వాల్తేరు వీరయ్య జనవరి 13 న రిలీజ్ అవుతోంది.