టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుగగా కొత్త ఏడాదిలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం రెండు సెట్ లు రెడీ అయ్యాయి. ఒకటేమో సారథి స్టూడియోస్ లో సెట్ వేయగా మరొక సెట్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో వేశారు.
ఆ రెండు సెట్ లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకులు త్రివిక్రమ్. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో మహేష్ తో పాటుగా పూజా హెగ్డే అలాగే పలువురు నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు ” అతడు ” , ” ఖలేజా ” చిత్రాలు వచ్చాయి. అతడు మంచి హిట్ కాగా ఖలేజా మాత్రం ప్లాప్ అయ్యింది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే కసిగా ఉన్నారట త్రివిక్రమ్. మహేష్ అభిమానులు కూడా ఈ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు.