
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బ్లాక్ బస్టర్ షో ” అన్ స్టాపబుల్ 2 ”. ఈ షోలో ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. బాహుబలి ఎపిసోడ్ ఒకటి ప్రసారం కాగా రెండో ఎపిసోడ్ ఈనెల 6 న స్ట్రీమింగ్ కానుంది.
ఇక తాజా విషయానికి వస్తే …… బాలయ్య అన్ స్టాపబుల్ షోలో తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ , హీరో రాంచరణ్ లు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కేటీఆర్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు. నాయకుడిగా ఎదిగాడు. ఇక తెలంగాణ మంత్రివర్గంలో రెండు కీలక శాఖలను నిర్వహిస్తూ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు.
ఇక చరణ్ సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఈజీనే కానీ ఆ తర్వాత తన ప్రతిభ తోనే స్టార్ డం అందుకున్నాడు. ఇప్పుడు చరణ్ రేంజ్ పాన్ ఇండియా స్టార్. ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా చరణ్ – కేటీఆర్ ఇద్దరు కూడా మంచి మిత్రులు. దాంతో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో వీళ్ళు పాల్గొననున్నట్లు సమాచారం. అంటే ఒకే ఎపిసోడ్ లో రాజకీయాల గురించి అలాగే సినిమాల గురించి వారసత్వాల గురించి మాట్లాడనున్నారన్నమాట.