40.1 C
India
Tuesday, May 7, 2024
More

    ప్రభుత్వ రక్షణ సలహాదారు సతీష్ రెడ్డిని సన్మానించిన డల్లాస్ మిత్రులు

    Date:

    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy
    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy

    DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్ రెడ్డికి డల్లాస్ మిత్రులు ఘనంగా సన్మానించారు. సతీష్ రెడ్డి తో పాటు చదువుకున్న JNTU హైదరాబాద్  మిత్రులు అలాగే మరికొంతమంది కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువాళ్లు తరలివచ్చారు. ఒక తెలుగు వ్యక్తి భారత రక్షణ సలహాదారుడుగా నియమింపబడటం గర్వకారణమని , అలాగే కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కోవిడ్ పేషేంట్ ల కోసం దేశీయంగా వెంటిలేటర్ లను తయారు చేయడం గొప్ప కార్యదక్షతకు నిదర్శనమని కొనియాడారు. ప్రవాసాంధ్రులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలిపారు సతీష్ రెడ్డి.

    అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లైన టాంటెక్స్ , తానా , నాటా , నాట్స్ , ఆటా సంస్థల ప్రతినిధులు సతీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి , చిల్లకూరు గోపి రెడ్డి , అజయ్ కలువ , ఉప్పలపాటి కృష్ణారెడ్డి , రామకృష్ణ , ప్రదీప్ రెడ్డి , బలరాం , భీమా , భాస్కర్ రెడ్డి ,సురేష్ మండువ తదితరులు పాల్గొన్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర దేశాల నుండి పాల్గొన్నవారిలో విలాస్ జంబుల , శ్రీకాంత్ తుమ్మల , సంతోష్ రెడ్డి , ప్రదీప్ కట్ట తదితరులు ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    YS Jagan : చంద్రబాబుకు 2019 గుర్తు చేసిన జగన్..!

    YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మచిలీపట్నం...

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...